నా రాజకీయ ప్రస్థానానికి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ తొలిమెట్టు: బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.) నా రాజకీయ ప్రస్థానానికి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ తొలిమెట్టుగా నిలిచిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లుగా ఎన్నికైన 12 మందికి అభినందనల
బండి సంజయ్


హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)

నా రాజకీయ ప్రస్థానానికి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ తొలిమెట్టుగా నిలిచిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఎక్స్ వేదికగా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లుగా ఎన్నికైన 12 మందికి అభినందనలు తెలిపారు. ఖాతాదారుల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వారి పనితీరు ఉండాలని ఆకాంక్షించారు.

నా రాజకీయ ప్రస్థానానికి ఈ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ తొలిమెట్టుగా నిలిచిందని గుర్తు చేసుకున్నారు. డైరెక్టర్గా పనిచేసిన సమయంలో కలిసికట్టుగా బ్యాంక్ అభ్యున్నతికి పాటు పడ్డామని వివరించారు. గతంలో కర్ర రాజశేఖర్ గారికి చైర్మన్ గా.. మిగతా వారికి డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉండటం వల్ల వారికి మద్దతు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande