కార్తీక పౌర్ణమి మహోత్సవానికి మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆహ్వానం
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.) హైదరాబాద్ చంపాపేట్ డివిజన్ కర్మన ఘాట్ హనుమాన్ ఆలయంలో వైభవంగా జరగబోయే కార్తీక పౌర్ణమి మహోత్సవంకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మరియు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు.
మంత్రి దుద్దిల్ల


హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.) హైదరాబాద్ చంపాపేట్ డివిజన్ కర్మన ఘాట్ హనుమాన్ ఆలయంలో వైభవంగా జరగబోయే కార్తీక పౌర్ణమి మహోత్సవంకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మరియు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ని ఆలయ నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహణాధికారి యన్. లావణ్య, ఆలయ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలు మరియు ఆలయ అర్చకులు కలిసి, మంత్రి మరియు ఎమ్మెల్యే ని వారి నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి హిందూ సంప్రదాయంలో పవిత్రమైన పర్వదినం. ఈ మహోత్సవం భక్తులలో భక్తి, విశ్వాసం, సద్భావనలను పెంపొందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయానికి, భక్తులకు అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తాం అన్నారు.

అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాల అభివృద్ధి, సాంస్కృతిక సాంప్రదాయాల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కార్తీక పౌర్ణమి మహోత్సవం భక్తి, ఐక్యతకు ప్రతీకగా నిలవాలి. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సద్భావాన్ని పెంపొందిస్తాయి, అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande