
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)
ప్రపంచస్థాయి సౌకర్యాలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది.
అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఈ స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం రూ.714.73 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు 46 శాతం పనులుపూర్తయ్యాయనీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
తెలంగాణలో ఈ ప్రాజెక్టు పూర్తయితే రైల్వే నెట్వర్క్ మరింత బలపడటంతో పాటు, ప్రయాణికులకు ప్రపంచస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునికీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత, ఇది దేశంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రముఖ రైల్వే కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..