ప్రజల భద్రత, రక్షణ కోసం నిషేధాజ్ఞలు.. రామగుండం పోలీస్ కమిషనర్
గోదావరిఖని, 2 నవంబర్ (హి.స.) సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిష
రామగుండం సిపి


గోదావరిఖని, 2 నవంబర్ (హి.స.)

సాధారణ పౌరులు ప్రధానంగా

మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి పాల్పడుతున్న ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. మద్యం సేవించి వీధుల్లో రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందని, మద్యం ప్రియులు ఆగడాలకు కళ్లెం వేయడంతో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు కొనసాగుతాయని తెలిపారు. (భారతీయ న్యాయ సంహిత) BNS 223, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, 1348 ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande