నేరాల నియంత్రణకు పోలీస్ పెట్రోలింగ్.. డిసిపి యోగేష్ గౌతమ్
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.) ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ అయ్యేలా, ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పెరిగేలా రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ద్విచక్ర వాహనం పై పెట్రోలింగ్ చేశారు. శనివారం రాత్రి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలలో
డిసిపి యోగేష్ గౌతమ్


హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)

ప్రజలకు పోలీసు సేవలు మరింత

చేరువ అయ్యేలా, ప్రజల్లో పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పెరిగేలా రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్ గౌతమ్ ద్విచక్ర వాహనం పై పెట్రోలింగ్ చేశారు. శనివారం రాత్రి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్తీలలో తిరుగుతూ ఆయన రౌడీషీటర్ లుగా ఉన్న వారి ఇళ్లను తనిఖీ చేశారు. రౌడీ షీటర్లు కోర్టు ఆదేశాల మేరకు షరతులకు అనుగుణంగా ఉండాలని సూచించారు. వారిపై నిరంతరం నిఘాకొనసాగుతున్నదని, భూ కబ్జాలు, సెటిల్మెంట్లలో తలదూర్చినా, అల్లర్లు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande