ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం.. మంత్రాల నెపంతో గొడ్డలితో దాడి.. వ్యక్తి మృతి
ఆసిఫాబాద్, 2 నవంబర్ (హి.స.) మంత్రాలు చేస్తున్నారనే నేపంతో ఓ వ్యక్తి పై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత మార్చిన సంఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మంగి గ్రామపంచాయతీ పరిధిలోని పట్టగూడ గ్రామానికి చెందిన హనుమం
మర్డర్


ఆసిఫాబాద్, 2 నవంబర్ (హి.స.)

మంత్రాలు చేస్తున్నారనే నేపంతో ఓ వ్యక్తి పై గొడ్డలితో దాడి చేసి దారుణంగా హత మార్చిన సంఘటన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మంగి గ్రామపంచాయతీ పరిధిలోని పట్టగూడ గ్రామానికి చెందిన హనుమంతరావు (50) తన కుటుంబ సభ్యులకు మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో శనివారం రాత్రి అదే గ్రామానికి చెందిన వినోద్ అనే వ్యక్తి హనుమంతు రావు తో గొడవ పడ్డాడు. ఈ గొడవ తీవ్రమై ఆవేశంతో వినోద్ హనుమంతరావు మెడ పై గొడ్డలితో నరకడంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఇది గమనించిన హనుమంతరావు భార్య అడ్డుకునేందుకు వెళ్లగా ఆమెపై కూడా వినోద్ దాడికి యత్నించాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande