మురుగునీటి శుద్ధి ప్లాంట్ వద్దే వద్దు.. ఉప్పల్ ఎమ్మెల్యే
హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.) ఉప్పల్ భగాయత్ కాలనీలలో కొన్నిరోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉప్పల్, కురుమనగర్, లక్ష్మీనరసింహ్మ కాలనీ సమీపంలో చేస్తున్న మురుగు శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణమే దీనికి ప్రధాన కారణం. స్థానికులు ఎస్టీపీని తమ కాలనీ
ఉప్పల్ ఎమ్మెల్యే


హైదరాబాద్, 2 నవంబర్ (హి.స.)

ఉప్పల్ భగాయత్ కాలనీలలో కొన్నిరోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఉప్పల్, కురుమనగర్, లక్ష్మీనరసింహ్మ కాలనీ సమీపంలో చేస్తున్న మురుగు శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణమే దీనికి ప్రధాన కారణం. స్థానికులు ఎస్టీపీని తమ కాలనీల సమీపంలో నిర్మించవద్దని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల కాలుష్యాలతో ఇబ్బందిపడుతున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదివారం అక్కడికి వెళ్లి వారికిి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీల వాసులు, ప్రజాప్రతినిధులుగా మేం ఎవరం అభివృద్ధిని, ఎస్టీపీ నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదన్నారు. కాలనీవాసుల ప్రయోజనం దృష్ట్యా మూసీ సమీపంలో నిర్మించాలని కోరుతున్నామని అన్నారు. రకరకాల కాలుష్యంతో ఇప్పటికే కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దీనిని గుర్తించాలని ఆయన కోరారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande