ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద ఈ నెల 30 న పదవి విరమణ
అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు మరో మూడు నెలల పాటు కొనసాగింపు ఇవ్వాలా లేదా కొత్త సీఎస్‌ను నియమించాలా అనే అంశంపై కూటమి ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీనియారిటీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద ఈ నెల 30 న పదవి విరమణ


అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు మరో మూడు నెలల పాటు కొనసాగింపు ఇవ్వాలా లేదా కొత్త సీఎస్‌ను నియమించాలా అనే అంశంపై కూటమి ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీనియారిటీ ప్రకారం చూస్తే ప్రస్తుత ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ మరియు సీఎం ఆఫీస్‌కు ప్రత్యేక సీఎస్‌గా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. విజయానంద్ రిటైర్ అయిన పక్షంలో సాయి ప్రసాద్‌కు సీఎస్ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయతే, కొత్త సీఎస్ నియామకంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. విజయానంద్ కొనసాగింపు అవకాశం ఉందా? లేక సాయి ప్రసాద్ కొత్త సీఎస్‌గా బాధ్యతలు స్వీకరిస్తారా? అనే అంశంపై అధికార వర్గాల్లో ఆసక్తికర చర్చ కొనసాగుతున్నా.. ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande