
అమరావతి, 22 నవంబర్ (హి.స.)
చీరాల(బాపట్ల), ):ఎరువులు పుష్కలంగా ఉన్నాయి.. ఎక్కడా కొరత లేదు. అవసరం మేరకు ఎంత కావాలంటే అంత సరఫరా చేస్తున్నాం. అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అదనపు ధర కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.. ఎవరైనా అలా వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి ఆ వ్యాపారులపై చర్యలు తీసుకుంటాం.. అని అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. రెండు రెట్ల ధరకు యూరియా విక్రయిస్తున్నా పట్టించుకునే వారే లేరు.
ధర గురించి ప్రశ్నిస్తే యూరియా(Urea)లేదనే సమాధా నంతో రైతులు నిరాశ చెందుతున్నారు. అత్యంత తక్కువ ధరకు లభ్య మవ్వాల్సిన యూరియాను బ్లాక్ చేసిన వ్యాపారులు ధరను అమాంతం పెంచేశారు. వాస్తవానికి యూరియా బస్తా రూ.266.50. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో ఒక్కో బస్తా రూ.500 చెల్లిస్తే తప్ప దొరకడంలేదు. గుంటూరు, బాపట్ల, పల్నాడు(Guntur, Bapatla, Palnadu)జిల్లా అంతటా ఇదే పరిస్థితి. కృత్రిమ కొరత సృష్టించి రైతుల నుంచి ఎక్కువ మొత్తం లో వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఎరువులు కేటాయింపులు.. అమ్మకాలు అన్నింట్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ