
పుట్టపర్తి, 22 నవంబర్ (హి.స.)
జన మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వ పని చేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయిబ బాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సత్యసాయి ట్రైబల్ వుమెన్ హెల్త్ కేర్ ప్రొగ్రాంను వేదికపై ప్రకటించారు. అందులో భాగంగా గిరిజన మహిళలకు సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తామన్నారు. అంతేకాకుండా టెలిమెడిసిన్ సేవలను అందుబాటులోకి తెస్తామన్నారు. మెడికల్ స్క్రీనింగ్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కు చికిత్సను అందిస్తామన్నారు.
అంతేకాకుండా త్రాగునీటిని సరఫరా చేస్తామని పేర్కొన్నారు. పేదరికం కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న గిరిజన మహిళలను చదివిస్తే, వారు సొంత కాళ్లపై నిలబడేలా చేస్తే మొత్తం గిరిజన సమాజాన్ని వారు ముందుండి నడిపిస్తారని సీఎం తెలిపారు. ఈ పథకం కేవలం సంక్షేమం మాత్రమే కాదన్నారు. దేశ నిర్మాణానికి ఒక ముందడుగు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే మాటకు నిదర్శనమని అభివర్ణించారు.
శ్రీ సత్యసాయిబాబా సిద్ధాంతాన్ని ప్రపంచంతో పంచుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రతి భక్తులు శాంతికి ప్రతినిధి కావాలని, ప్రి ఇల్లు సేవకు కేంద్రం కావాలని, ప్రతి భూభాగం సత్యం, శాంతి, అహింసలకు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ ఐదు సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరచాలన్నారు. బాబా మనకిచ్చిన సిద్ధాంతాన్ని ప్రచారం చేయడమంటే ఆయన ఆశయాల సాకారానికి పని చేయడమేనని స్పష్టం చేశారు. ప్రపంచంలో శాంతి, సంతోషం నెలకొనాలనే ఆయన ఆకాంక్షలనె నెరవేరుద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV