.మారేడుమిల్లి.అడవుల్లో భారీబెంకోంటర్ల నేపద్యంలో ప్రజాప్రతినిధులకు ఏపి పోలీసు ఆంక్షలు
అల్లూరి జిల్లా, 22 నవంబర్ (హి.స.) మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. రేపు(ఆదివారం)
.మారేడుమిల్లి.అడవుల్లో భారీబెంకోంటర్ల నేపద్యంలో ప్రజాప్రతినిధులకు ఏపి పోలీసు ఆంక్షలు


అల్లూరి జిల్లా, 22 నవంబర్ (హి.స.)

మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. మన్యంలోకి రావద్దని ప్రజాప్రతినిధులకు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు. రేపు(ఆదివారం) దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు భద్రత చర్యలు చేపట్టారు. అయితే, వరుస ఎన్‌కౌంటర్లతో హడలిపోతున్నారు గిరిజనులు. ఏవోబీ సరిహద్దు ప్రాంతంతో పాటు మారేడుమిల్లి అడవుల్లో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మైదాన ప్రాంతాల్లోనూ మావోయిస్టుల కోసం నిఘా పెట్టారు ఏపీ పోలీసులు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande