
సిద్దిపేట, 21 నవంబర్ (హి.స.)
దేశం ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్గా
ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలవాలని, భారతదేశాన్ని 2047 నాటికి వికసిత దేశంగా తీర్చిదిద్దేందుకు యువత ముందుకు రావాలని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు పిలుపునిచ్చారు. సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని శుక్రవారం దుబ్బాక పట్టణంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్దా కలిసి 'ఏక్తా ర్యాలీ'ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ హైదరాబాద్, జమ్మూ-కాశ్మీర్ వంటి కొన్ని రాజ్యాలు దేశాలుగా కొనసాగాలని స్వతంత్య్ర ప్రయత్నించినప్పటికీ, నిజాం నవాబు పై ఆపరేషన్ పోలో పేరుతో భారత్ చేపట్టిన యుద్ధం అనంతరం, దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 155 హైదరాబాద్ అధికారికంగా భారతదేశంలో విలీనమైందని గుర్తుచేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు