
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.) హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియోలకు జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి గత కొన్ని సంవత్సరాలుగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు భారీగా ఎగవేతకు పాల్పడుతున్నట్లు బల్దియా అధికారులు గుర్తించారు. తాజా డేటా ప్రకారం.. రూ. 11.52 లక్షలు ఫీజు చెల్లించవలసిన అన్నపూర్ణ స్టూడియో , కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లిస్తున్నట్లు తేలింది.
అలాగే రూ. 1.92 లక్షలు చెల్లించాల్సిన రామానాయుడు స్టూడియోస్, కేవలం రూ. 19000 మాత్రమే చెల్లిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దర్యాప్తు నిర్వహించి, ఇరు స్టూడియోలకు పూర్తి స్థాయి ట్రేడ్ లైసెన్స్ ఫీజులను తక్షణమే చెల్లించాలని నోటీసులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..