
సిద్దిపేట, 21 నవంబర్ (హి.స.)
ఆవిష్కరణ లేకుంటే ప్రపంచమే లేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలో ని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ను ఎమ్మెల్యే హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగ వారు మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని కొత్త ఆలోచన రూపం కలిగించేదే సైన్స్ ఫెయిర్ అన్నారు. ప్రతి విద్యార్థిలో సైంటిస్ట్ ఉంటారన్నారు. సైన్స్ ఫెయిర్లు విద్యార్థుల్లో ప్రేరణ కలిగించడానికి దోహదపడతాయన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..