
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)
హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున సహకరించాలని కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మంత్రిని మర్యాద పూర్వకంగా కలసి, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమగ్రంగా చర్చించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయడానికి తగిన బడ్జెట్ వెంటనే కేటాయించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివరించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు