
తెలంగాణ, 21 నవంబర్ (హి.స.)
కుటీర పరిశ్రమ కింద ఉన్న పవర్లూమ్
యజమానులకు, కార్మికులకు ఐదు నెలల క్రితం త్రిప్ట్ పథకం ముగిసిందని, వెంటనే పునఃప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మండలంలోని యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం పద్మశాలులు శుక్రవారం కలిసి కోరారు. త్రిప్ట్ పథకాన్ని చేనేత కార్మికుల మాదిరిగా పవర్లూమ్ కార్మికులకు కూడా వర్తింప చేసి, కార్మికుడు 8 శాతం అంటే రూ. 1,200 జమ చేస్తే, ప్రభుత్వం నుంచి 16 శాతం అయిన రూ. 2,400 జమ చేయించాలని విజ్ఞప్తి చేశారు. కుటీర పరిశ్రమ కింద ఉన్న పవర్లూమ్ పరిశ్రమను చేనేత పరిశ్రమ కింద పరిగణలోకి తీసుకోవాలని కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు