మక్తల్ వాసులకు ఎల్లవేళలా అండగా ఉంటా.. మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.) బతుకుదెరువు కోసం వలస కూలీలుగా, చిరువ్యాపారులుగా హైదరాబాద్లో జీవనోపాధి కొనసాగిస్తున్న మక్తల్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి గురువారం రాత్రి వారి నివాసాలకు వెళ్లి సమస్యలు ఆరా తీశ
మంత్రి వాకిటి శ్రీహరి


హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)

బతుకుదెరువు కోసం వలస కూలీలుగా, చిరువ్యాపారులుగా హైదరాబాద్లో జీవనోపాధి కొనసాగిస్తున్న మక్తల్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న మంత్రి వాకిటి శ్రీహరి గురువారం రాత్రి వారి నివాసాలకు వెళ్లి సమస్యలు ఆరా తీశారు. మక్తల్ ప్రజలు ఎక్కడ ఉన్నావారికి అండగా ఉంటానని, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పటికీ మరవనని మంత్రి వాకిటి శ్రీహరి మరోసారి నిరూపించారు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన మక్తల్ వాసులు తమ ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకురాగానే, ఆయన వెంటనే స్పందించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande