సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం. నియోజకవర్గంలో పర్యటించారు
అమరావతి, 21 నవంబర్ (హి.స.): సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ( శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. శాంతిపురం మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరిం
సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం. నియోజకవర్గంలో పర్యటించారు


అమరావతి, 21 నవంబర్ (హి.స.): సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ( శుక్రవారం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. శాంతిపురం మండలం శివపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో స్థానిక ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలతో వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ మూడో రోజు శాంతిపురం మండలంలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, పలువురు తెదేపా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande