
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)
రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయని ప్రజలు ఆవేద చెందుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం బోడగుట్ట పంచాయతీ పరిధిలోని దేవునిగుట్ట తండాలో రూ. కోటితో ఇటీవల బీటీ రోడ్డు నిర్మించారు. నిర్మించిన 24 గంటలకే చేతితో పీకితే డాంబర్ రోడ్డు, పెచ్చులుగా ఊడిపోయింది. ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడడంతోనే, ఇలాంటి నాసిరకం నిర్మాణాలు జరుగుతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు.
ఈ నాసిరకం రోడ్లపై బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అచ్చం తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన లాగానే ఉంది ఈ డాంబర్ రోడ్డు. ఇట్లాంటి ఫేక్ రోడ్లను మనం నిర్మించుకుంటూ బీహారీలను నిందించడం సరికాదు అని పేర్కొన్నారు. ఈ రోడ్ల మీద నమ్మకం లేకనే మన మంత్రి కోమటిరెడ్డి హెలికాప్టర్ను విరివిగా వాడుతున్నట్లుంది. ఇంకా ఏ మొహం పెట్టుకోని డిసెంబర్లో ప్రజాపాలన వారోత్సవాలు ఫెయిల్యూర్ సిటీలో నిర్వహిస్తారని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు