బండి సంజయ్ రాజ్యాంగం ఉందని మర్చిపోతున్నాడు: ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.) కేంద్రమంత్రి బండి సంజయ్ రాజ్యాంగం ఉందని మర్చిపోతున్నాడని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను హరగోపాల్ ఖండించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తననే కాకుండా రాహుల్ గాంధీని కూడా అర్బన్ మావో
ప్రొఫెసర్


హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.) కేంద్రమంత్రి బండి సంజయ్ రాజ్యాంగం ఉందని మర్చిపోతున్నాడని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఇటీవల బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను హరగోపాల్ ఖండించారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తననే కాకుండా రాహుల్ గాంధీని కూడా అర్బన్ మావోయిస్టు అన్నారని ఇంకా అర్బన్ మావోయిస్టు కానివాళ్లు ఎవరు ఉన్నారని ప్రశ్నించారు.

సరైన ఆధారాలు లేకుండా నిందలు వేయకూడదని అన్నారు. కేంద్రమంత్రి హోదాలో ఉండి రాజ్యాంగం ఉందని, ఆయన వెనుక ప్రభుత్వం ఉందని మర్చిపోతున్నారని చెప్పారు. తాము ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదనికానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande