మా పత్తి కొనండి సారు..! అధికారి కాళ్ళు మొక్కిన రైతు..
మహబూబ్నగర్, 21 నవంబర్ (హి.స.) తాము కష్టపడి పండించిన పత్తి కొనుగోలు విషయంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల పట్టణ కేంద్రంలో మహేష్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో గద్వాల జిల
పత్తి రైతులు


మహబూబ్నగర్, 21 నవంబర్ (హి.స.) తాము కష్టపడి పండించిన పత్తి కొనుగోలు విషయంలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ పత్తి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జడ్చర్ల పట్టణ కేంద్రంలో మహేష్ ఇండస్ట్రీలో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో గద్వాల జిల్లా అలంపూర్ రైతులు 90 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. మూడు రోజుల తర్వాత 30 క్వింటాళ్ల పత్తిని తీసుకొని, మిగతా పత్తిని తీసుకోవడానికి సీసీఐ అధికారులు నాణ్యత, తేమశాతం పేరుతో కొర్రీలు పెడుతూ కొనడానికి నిరాకరించారు. దీంతో గత్యంతరం లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఓ రైతు సీసీఐ అధికారుల కాళ్లు మొక్కాల్సిన పరిస్థితి నెలకొంది. అయినా మాత్రం అధికారులు కనికరించడం లేదని తాము పండించిన పత్తిని రోడ్డుపై పారబోస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తమ పత్తిని కొనుగోలు చేయాలంటూ రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రంలో నిరసనకు దిగారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande