గవర్నర్లకు డెడ్ లైన్ ఉండాల్సిందే : సీఎం స్టాలిన్
చెన్నై, 21 నవంబర్ (హి.స.) బిల్లులను క్లియర్ చేసేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధించలేమని సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని ఆ
స్టాలిన్


చెన్నై, 21 నవంబర్ (హి.స.)

బిల్లులను క్లియర్ చేసేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధించలేమని సుప్రీంకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. బిల్లులకు ఆమోదం దక్కాలంటే.. గవర్నర్లకు గడువు ఉండాల్సిందే అని ఆయన అన్నారు. దీని కోసం రాజ్యాంగ సవరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గవర్నర్లకు గడువు విధించే వరకు విశ్రమించలేది లేదని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ముర్ము అడిగిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు చేసిన సూచనలపై సీఎం స్టాలిన్ రియాక్ట్ అవుతూ.. రాష్ట్ర హక్కుల కోసం పోరాడనున్నట్లు వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande