
హైదరాబాద్, 21 నవంబర్ (హి.స.)
ప్రతిష్టాత్మక వరల్డ్ బాక్సింగ్ ఫైనల్స్ లో పసిడి పథకం సాధించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మీ అవిశ్రాంత కృషి, అజేయ స్ఫూర్తి భారతదేశం, తెలంగాణను గర్వపడేలా చేస్తూనే ఉన్నాయని కొనియాడారు. నేటి యువతులకు మీరు ఒక ప్రేరణ అని కేటీఆర్ అన్నారు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు