
కాకినాడ, 22 నవంబర్ (హి.స.) , రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై ఏపీ సీఎం చంద్రబాబు) ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చూపిన వైద్యులు, సిబ్బందిపై చర్యలకు ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత వైద్య సిబ్బందిపై పూర్తిస్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ జీజీహెచ్‌లో మృతి చెందిన గర్భిణి కుటుంబానికి సాయం అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు తెలిపారు.
కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో జరిగిన ఘటనలో, తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి మల్లేశ్వరి వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో 55 ఏళ్ల రోగికి అక్టోబర్ 2025 తేదీకి గడువు ముగిసిన మందులను.. నవంబర్ 8న అక్కడ ఆసుపత్రి వర్గాలు ఇచ్చాయి. వాటిని వాడిన రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. (Andhra Pardesh News)
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ