
జయశంకర్ భూపాలపల్లి, 22 నవంబర్ (హి.స.) జయశంకర్
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లోని మొదటి, రెండవ దశలలో సాంకేతిక లోపంతో ఒకేసారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రెండు దశలలో కలిపి 1100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో రూ. కోట్లలో నష్టంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. కేటీపీపీలో ఒకేసారి రెండు దశలలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో మరమ్మతులు చేసే పనిలో కేటీపీపీ అధికారులు నిమగ్నమైనారు. ఒకటో దశలో ఫ్లాష్ ఓవర్, రెండో దశ బైలర్ ట్యూబ్లిక్ నిలిచిపోయాయి. దీంతో కేటీపీపీలో విద్యుత్ ఉత్పత్తి కావడం ఇబ్బందిగా మారింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు