తూకం చీరలు కాదు.. నేత చీరలు ఇస్తున్నాం : మంత్రి వాకిటి శ్రీహరి
నారాయణపేట, 22 నవంబర్ (హి.స.) తెలంగాణలోని మహిళలకు సస్తా బజార్లో తూకంతో కొన్నచీరలు కాకుండా తమ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులతో నేసిన చీరలను ఆడవారికి గౌరవంగా ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ లో శనివారం ఓ ప్రైవేట్
మంత్రి వాకిటి


నారాయణపేట, 22 నవంబర్ (హి.స.) తెలంగాణలోని మహిళలకు సస్తా బజార్లో తూకంతో కొన్నచీరలు కాకుండా తమ ప్రభుత్వం సిరిసిల్ల నేత కార్మికులతో నేసిన చీరలను ఆడవారికి గౌరవంగా ఇస్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ లో శనివారం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఐకేపీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను పంట పొలాల చుట్టూ రక్షణ కోసం కట్టే రకంగా ఉండేవని.. వాటిని తెలంగాణ మహిళలు తీసుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదన్నారు. కానీ తమ ప్రభుత్వం చేనేత సొసైటీలకు స్వయం ఉపాధి పనులు కల్పించేందుకు రాష్ట్రంలో పేరు పొందిన సిరిసిల్ల నేత కార్మికులతో నేసిన చీరలను మహిళలు ధరించేలా నాణ్యమైన చీరలను ఇస్తున్నామన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande