.మయన్మార్ లోని. సైబర్ క్రైమ్ నెట్వర్క్ నుంచి.కాపాడిన 370 మంది స్వదేశానికి
అమరావతి, 22 నవంబర్ (హి.స.)మయన్మార్‌లోని సైబర్‌ క్రైమ్‌ నెట్‌వర్క్‌ నుంచి కాపాడిన మరో 370 మందిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి రప్పించింది. మూడు ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఢిల్లీ చేర్చింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 55 మంది ఉన్నారని రాష్ట్ర ప
.మయన్మార్ లోని. సైబర్ క్రైమ్ నెట్వర్క్ నుంచి.కాపాడిన 370 మంది స్వదేశానికి


అమరావతి, 22 నవంబర్ (హి.స.)మయన్మార్‌లోని సైబర్‌ క్రైమ్‌ నెట్‌వర్క్‌ నుంచి కాపాడిన మరో 370 మందిని కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి రప్పించింది. మూడు ప్రత్యేక విమానాల ద్వారా వారిని ఢిల్లీ చేర్చింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 55 మంది ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ 55 మంది విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారని తెలిపింది. ఢిల్లీ చేరుకొన్న అనంతరం ఏపీ భవన్‌ అధికారుల బృం దం కేంద్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరిపి.. వారిని ఢిల్లీలోని ఏపీ భవన్‌కు తరలించారు.

వారందరికి వెంటనే తాత్కాలిక వసతి, ఆహార ఏర్పా ట్లు చేశారు. మయన్మార్‌లో వారి మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకోగా.. వారి వద్ద డబ్బులు లేకపోవడంతో, తదుపరి ప్రయాణ ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.1,000 సహాయం అందించారు. బాధితులను స్వస్థలాలకు చేర్చేందుకు వీలుగా రైల్వే అధికారులతో మాట్లాడి ప్రయాణ ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటి వరకు మయన్మార్‌ సైబర్‌ క్రైమ్‌ నెట్‌వర్క్‌ నుంచి రక్షింపబడిన 79 మంది ఏపీ వాసులను సొంత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande