
కర్నూలు, 22 నవంబర్ (హి.స.)కొన్నిరకాల ఆహార పదార్థాలను విడిగా కాకుండా వేరేవాటితో కలిపి తింటేనే మంచి ఫలితం ఉంటుంది. ఒకదానిలోని పోషకాలు మరో ఆహారంలోని పోషకాలతో కలిసి శోషణ సామర్థ్యం పెరిగి శరీరానికి రెట్టింపు బలాన్నిస్తాయి. ఇలాంటి 5 సూపర్ ఫుడ్ కాంబినేషన్స్ని AIIMS, హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌లలో శిక్షణ పొందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఆ 5 సూపర్ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో తెలుసుకుందాం..
చియా సీడ్స్ + పెరుగుచియా సీడ్స్‌లోని సాల్యూబుల్ ఫైబర్, పెరుగులోని ప్రోబయోటిక్స్ కలిస్తే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచి, అనవసరమైన క్రేవింగ్స్‌ను అరికడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక గిన్నె గ్రీక్ యోగర్ట్‌లో ఒక టీస్పూన్ చియా సీడ్స్ వేసుకుంటే రోజంతా శరీరానికి కావల్సిన శక్తి అందుతుంది.
ఓట్స్ + వాల్‌నట్స్
ఓట్స్‌లోని బీటా-గ్లూకాన్, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెను కాపాడతాయి. రెండూ కలిస్తే గుండె ఆరోగ్యం, మెదడు పనితనం రెండూ మెరుగవుతాయి.ఉదయం ఓట్‌మీల్‌లో 5-6 వాల్‌నట్స్ ముక్కలు చల్లితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
బియ్యం + ధాన్యాలు (బీన్స్/రాజ్మా/చిక్పీస్)బియ్యంలో ప్రోటీన్ అసంపూర్ణంగా ఉంటుంది, కానీ దానితో ధాన్యాలు కలిపితే పూర్తి ప్రోటీన్తో పాటు అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ లభిస్తాయి. ఇది కండరాలను దృఢపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడానికి దోహదపడుతుంది. మన ఇంటి రాజ్మా-చావల్, చనా-రైస్ ఎప్పటికీ సైంటిఫిక్‌గా పర్ఫెక్ట్ కాంబో!
70% పైగా కోకో ఉన్న డార్క్ చాక్లెట్‌లో మెగ్నీషియం పుష్కలం. బాదంలో హెల్తీ ఫ్యాట్స్, విటమిన్ E ఉంటాయి. రెండూ కలిస్తే మూడ్ మెరుగవుతుంది, బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. సాయంత్రం స్నాక్‌గా 2-3 చిన్న డార్క్ చాక్లెట్ ముక్కలతో 8-10 బాదం తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV