అమెజాన్లో రికార్డు స్థాయిలో లేఆఫ్స్.. 40 శాతం టెకీల కోత..!
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గత నెలలో భారీగా లేఆఫ్స్ (Layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్
అమెజాన్


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) గత నెలలో భారీగా లేఆఫ్స్ (Layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ లేఆఫ్స్ ప్రభావం సంస్థలోని దాదాపు అన్ని విభాగాలపై పడింది. క్లౌడ్ సర్వీసెస్, డివైజెస్, రిటెయిల్, అడ్వర్టైజింగ్, గ్రాసరీస్ విభాగాల్లోని ఉద్యోగులు ప్రభావితమయ్యారు. అయితే, ఈ లేఆఫ్స్కు సంబంధించిన కీలక వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆ కోతల్లో అత్యధికంగా నష్టపోయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్లేనని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande