సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్ మార్కుల్లో ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ : భట్టి విక్రమార్క
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాలో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల సృజనాత్మకతను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసించారు. శనివారం ఆయన అక్కినేని నాగార్జున, అమలలతో కలిసి కాలేజీని సందర్శించారు. ఈ
భట్టి విక్రమార్క


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ &

మీడియాలో వివిధ కోర్సులు చేస్తున్న విద్యార్థుల సృజనాత్మకతను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసించారు. శనివారం ఆయన అక్కినేని నాగార్జున, అమలలతో కలిసి కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ ను గుర్తు చేసుకున్నారు. 1970ల కాలంలో ఆ ప్రాంతంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేనప్పుడు అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలను ఎలా స్థాపించారో.. నేటికీ అదే స్థాయిలో అవి గుర్తింపు పొందడం గర్వకారణమన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ హైదరాబాద్ లోని అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక, సినిమాటిక్ ల్యాండ్ మార్కుల్లో ఒకటిగా ఎలా ఎదిగిందో గుర్తు చేసుకుంటూ.. సంస్థ గొప్ప వారసత్వాన్ని ప్రశంసించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande