
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) సినీ పరిశ్రమను వదలకుండా వెంటాడుతున్న పైరసీ సమస్యపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టాలంటే కేవలం దానిని సరఫరా చేసేవారినే కాకుండా... చూసే ప్రేక్షకులను కూడా నేరస్తులుగా ట్రీట్ చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో పరిశ్రమ మొత్తం పైరసీ సమస్యపై స్పందిస్తుండగా, వర్మ చేసిన ఈ కామెంట్లు మరింత వివాదం రేపుతున్నాయి.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు