అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినా (North Carolina)లో శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు. క్రిస్మస్ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని (Christmas Tree Lighting) నిర్వహించార
అమెరికాలో కాల్పులు


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినా (North Carolina)లో శుక్రవారం సాయంత్రం జరిగిన కాల్పుల ఘటనలో అనేక మంది గాయపడ్డారు. క్రిస్మస్ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని (Christmas Tree Lighting) నిర్వహించారు. ఈ ఈవెంట్కు దాదాపు 200 మందికిపైగా హాజరయ్యారు. రాత్రి 7:30 గంటల సమయంలో అక్కడ కాల్పులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాద సమయంలో అక్కడ 200 నుంచి 300 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande