
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్
బెనిఫిట్స్ కూడా చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న ఈ విశ్రాంత ఉద్యోగి మాటలు వింటే మనస్సు చలించిపోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మూటలు, కోతలు, వాటాలు, కమీషన్ల గురించి మాత్రమే పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ.. మీకు రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కన్నీళ్లు కనిపించడం లేదా? వేదన వినిపించడం లేదా? అని ప్రశ్నించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు