iBOMMA రవి కేసులో కీలక మలుపు.. తెలంగాణ సీఐడీ ఎంట్రీ
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఐబొమ్మ రవి (Ravi) పైరసీ కేసులో తెలంగాణ సీఐడీ (CID) ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)
సిఐడి


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం

సృష్టిస్తున్న ఐబొమ్మ రవి (Ravi) పైరసీ కేసులో తెలంగాణ సీఐడీ (CID) ఎంట్రీ ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సైబర్ క్రైమ్ పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారుల నుంచి సేకరించింది. అయితే, నిందితుడు రవిని నవంబర్ 6న ఫ్రాన్స్ (France) నుంచి హైదరాబాద్ (Hyderabad)కు రాగా కూకట్పల్లిలోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లో సైబర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు నిందితుడు రవికి 5 రోజుల పోలీసు కస్టడీ మంజూరు చేసింది.

మూడు దేశాల్లో సర్వర్లు..

విచారణ భాగంగా సంచలనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిందితుడు రవి దాదాపు 21 వేలకు పైగా సినిమాలు పైరసీ చేసినట్లుగా ఒప్పుకున్న ఆధారాలు కూడా లభించాయి. అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో సర్వర్లు ఏర్పాటు చేసి అశ్విన్కుమార్, కిరణ్కుమార్ లాంటి వ్యక్తులకు లక్షలు చెల్లించి వెబ్సైట్లలో సినిమాలు అప్లోడ్ చేశాడు. ఐబొమ్మ, ఐవిన్, బప్పం వంటి 17 వెబ్సైట్లను రవి ఒంటిచేత్తో నడిపినట్లు ఇన్వెస్టిగేషన్లో తేలింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande