
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)
డాలర్ వద్ద భారత కరెన్సీ రూపాయి
చారిత్రక కనిష్ఠానికి పతనమైంది. శుక్రవారం డాలర్ తో పోలిస్తే.. రూపాయి విలువ ఏకంగా 98 పైసలు నష్టపోయి.. రూ.89.66 వద్ద ముగిసింది. రూపాయి విలువ 89 మార్ను దాటడం ఇదే తొలిసారి. 2022 ఫిబ్రవరి 24న రూపాయి 99 పైసలు నష్టపోయింది. గడిచిన మూడేళ్లలో ఎన్నడూలేని రీతిలో ఒక్కరోజులోనే రూపాయి 98 పైసలు నష్టపోయింది. ఏడాది కాలంలో ఇప్పటి వరకూ రూపాయి విలువ 4.6 శాతం మేర క్షీణించి.. ఆసియాలోనే అత్యంత బలహీనపడిన కరెన్సీగా నిలిచింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..