
జోగులాంబ గద్వాల, 22 నవంబర్ (హి.స.)
జోగులాంబ గద్వాల జిల్లా, కేటీ దొడ్డి మండలం పరిధిలోని నందిన్నె గ్రామంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శుక్రవారం జాంపల్లి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడు మృతి చెందిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ సర్పంచ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, గ్రామంలో భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసు బలగాలను మోహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. చిన్న భీమారాయుడు మరణంపై నెలకొన్న సందిగ్ధత, అనుమానాల దృష్ట్యా, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామంలో గట్టి నిఘా ఉంచి, అనుమానాస్పద శాంతి కార్యకలాపాలను అరికట్టేందుకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..