మహిళా అభివృద్ధికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత.. మంత్రి వివేక్ వెంకటస్వామి
సిద్దిపేట, 22 నవంబర్ (హి.స.) తెలంగాణ ప్రగతి ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం గజ్వేల్ నియోజకవర్గం లోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి హాజరై మహ
Minister Vivek


సిద్దిపేట, 22 నవంబర్ (హి.స.)

తెలంగాణ ప్రగతి ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం గజ్వేల్ నియోజకవర్గం లోని మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి హాజరై మహిళలకు చీరల పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహిళ అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 54 వేల చీరలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. తెలంగాణ గీతాలాపన సమయంలో చాలా మంది మహిళలు గేయాన్ని ఆలపించడం జరిగిందని రాష్ట్ర గీతానికున్న ప్రాముఖ్యత తెలియజేస్తుందన్నారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి సీఎం రేవంత్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఇస్తూన్నారన్నారు. మహిళలను అన్ని రంగాల్లో బలోపేతం చేయడానికి మహిళా శక్తి పెంచడానికి వారే స్వంతంగా ఆదాయం సంపాదించడం కోసం కుటుంబానికి పోషించడం కోసం అనేక పథకాలు చేపట్టారని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande