ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్లో కీలక పరిణామాలు.. శ్రీధర్ బాబుతో దానం భేటీ
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. మంత్రి శ్రీధర్ బాబుతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో నిన్న ఏఐసీసీ పెద్దలు, న్యాయ నిపుణులతో సమావేశమైన
దానం నాగేందర్


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎపిసోడ్ ఆసక్తి రేపుతోంది. మంత్రి శ్రీధర్ బాబుతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో నిన్న ఏఐసీసీ పెద్దలు, న్యాయ నిపుణులతో సమావేశమైన దానం ఇవాళ శ్రీధర్ బాబుతో సమావేశం కావడంతో దానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాశంగా మారింది. పరిస్థితుల దృష్ట్యా తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితే వస్తే తిరిగి తనకే టికెట్ ఇవ్వాలని ఏఐసీసీ పెద్దలను దానం కోరినట్లు తెలుస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande