
అమరావతి, 22 నవంబర్ (హి.స.)
కుప్పం గ్రామీణం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన సీఎం చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి శనివారం కుప్పం మండలంలో విస్తృతంగా పర్యటించారు. పెద్దవంకలోని చెక్ డ్యామ్‌లో బోటులో ప్రయాణించి శ్రీ కనకనాశమ్మ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కాసేపు తమిళంలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం నాయనూరు, దాసేగౌనూరు గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. కుప్పం అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కడా పీడీ వికాస్ మర్మత్, తెదేపా మండల అధ్యక్షుడు రాజగోపాల్‌తో పాటు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ