
నారాయణపేట, 22 నవంబర్ (హి.స.)
మక్తల్ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన పనులను అన్ని విభాగాల అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజు మక్తల్ తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్, ఆర్ డి ఓ రామచంద్రనాయక్, డి.ఎస్.పి వివిధ జిల్లా అధికారులు మక్తల్ తాసిల్దార్ సతీష్ కుమార్ పాల్గొన్నారు.
నియోజకవర్గంలో 400 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి డిసెంబర్ మొదటి తేదీ సీఎం మక్తల్ పర్యటన ఉంటుందని, అందుకు జిల్లాలోని అన్ని విభాగాల జిల్లా అధికారులు అందుబాటులో ఉండి వారికి సంబంధించిన విభాగాలలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్టులతో నివేదికలతో సిద్ధంగా ఉండాలని ఎలాంటి పొరపాట్లు నిర్లక్ష్యం చేయరాదని, సమావేశంలో అధికారులకు చెప్పడం జరిగింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు