నోబెల్ శాంతి బహుమతితో చిక్కులు.. దేశం వదలలేని దుస్థితిలో కొరీనా మాచడో
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) వెనిజులా విపక్ష నేత, ధీశాలి మరియాకోరినా కు ఇటీవల నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆ గౌరవం ఆమెకు అతి పెద్ద సవాలుగా మారింది. తాజాగా, మరియా కొరీనా మాచడో నోబెల్ బహుమతి స్వీకరించడానికి ఒకవేళ ద
కొరీనా మాచడో


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)

వెనిజులా విపక్ష నేత, ధీశాలి మరియాకోరినా కు ఇటీవల నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆ గౌరవం ఆమెకు అతి పెద్ద సవాలుగా మారింది. తాజాగా, మరియా కొరీనా మాచడో నోబెల్ బహుమతి స్వీకరించడానికి ఒకవేళ దేశం దాటితే.. ఆమెను తక్షణమే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని వెనిజులా అటార్నీ జనరల్ తారెక్ విలియం సాబ్ (Tarek William Saab) సంచలన ప్రకటన చేశారు.

కానీ, డిసెంబర్ 10న నార్వే (Norway) రాజధాని ఓస్లోలో జరగనున్న నోబెల్ శాంతి బహుమతి ప్రదానోత్సవానికి హాజరు కావాలంటే మాచడో వెనిజులా వదిలి వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆమెపై ఉగ్రవాదం, దేశద్రోహం, ద్వేషం రెచ్చగొట్టడం వంటి తీవ్రమైన ఆరోపణలతో కేసులలో విచారణ కొనసాగుతోంది. ఒకవేళ కొరీనా ధైర్యం చేసి దేశం దాటి వెళ్తే ఆమెను అంతర్జాతీయంగా వారంట్ జారీ చేసి అరెస్ట్ చేయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా, నోబెల్ కమిటీ మాచడోకు వెనిజులాలో ప్రజాస్వామ్యం కోసం, ఏకాధిపత్య పాలనకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడిన ధైర్యాన్ని కొనియాడింది. ప్రస్తుతం మరియా కొరీనా కారకాస్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె దేశం దాటి నోబెల్ బహుమతిని స్వీకరిస్తుందా.. లేక కార్యక్రమానికి గైర్హాజరు అవుతుందా అనేది తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande