హన్మకొండ జిల్లా వేలేరులో హిడ్మా ఫ్లెక్సీల కలకలం!
హనుమకొండ, 22 నవంబర్ (హి.స.) హన్మకొండ జిల్లా వేలేరులో ఇటీవల మరణించిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా ఫ్లెక్సీల కలకలం రేగింది. సురేష్, బచ్చయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలో ఓ వీరుడా నువ్వు కన్న కల దోప
హిడ్మా ఫ్లెక్సీల


హనుమకొండ, 22 నవంబర్ (హి.స.)

హన్మకొండ జిల్లా వేలేరులో ఇటీవల

మరణించిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత హిడ్మా ఫ్లెక్సీల కలకలం రేగింది. సురేష్, బచ్చయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఫ్లెక్సీలో ఓ వీరుడా నువ్వు కన్న కల దోపిడీ లేని స్వేచ్ఛ దేశం. నీ సింధూరం పీడిత జనానికి కొత్త పొద్దు. ప్రజల గుండెల్లో నీ చరిత్ర సజీవం. పీడిత జనాల స్వేఛ్చా పోరాటానికి నీవు నిత్యం రణభేరి నినాదం. జనతన సర్కార్ ఆశయం చిరస్థాయి వీరుడా హిడ్మా.. నీ పోరాటం అమరం.. అంటూ ఫ్లెక్సీలో రాసి ఉంది.

దీంతో ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మావోయిస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande