
సంగారెడ్డి, 22 నవంబర్ (హి.స.) కూరగాయల ధరలు కొండెక్కడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ కూరగాయ ధర చూసినా భగ్గుమంటున్నది. దీంతో కొన లేం.. తినలేం అన్నట్లుగా పరిస్థితి మారింది. కొద్దిరోజులుగా సంగారెడ్డి జిల్లాలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. నవంబర్లో సాధారణంగా కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి. కానీ, వరుస వర్షాలు, మొంథా తుపాన్తో భారీగా కూరగాయల పంటకు నష్టం జరిగింది. దిగుబడి సైతం బాగా తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు పెరిగాయి.ఏ కూరగాయ చూసినా కిలో రూ.80-100 వరకు పలుకుతున్నది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు