రాజీనామాపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, 22 నవంబర్ (హిం.స) పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ వేగవంతం చేసిన వేళ తన రాజీనామాపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయం మేరకు నా నిర్ణయం ఉంటుందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు, న్యాయనిపుణులతో ప
కడియం శ్రీహరి


హైదరాబాద్, 22 నవంబర్ (హిం.స) పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ వేగవంతం చేసిన వేళ తన రాజీనామాపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ నిర్ణయం మేరకు నా నిర్ణయం ఉంటుందని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు, న్యాయనిపుణులతో ప్రస్తుతం చర్చిస్తున్నానని ఒక వేళ ఉప ఎన్నిక వచ్చినా పోటీ చేసేది నేనే అని ప్రజలు గెలిచించేది కూడా నన్నే అని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఓ న్యూస్ చానల్తో మాట్లాడిన కడియం శ్రీహరి.. తన రాజీనామాపై ప్రతిపక్షాలది అత్యుత్సాహమేనన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande