శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.) దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. అరైవల్ ప్రాంతంలో ఆర్డీఎక్స్ బాంబు ఉంచినట్లు ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం
బాంబు బెదిరి


హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)

దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. అరైవల్ ప్రాంతంలో ఆర్డీఎక్స్ బాంబు ఉంచినట్లు ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం బెదిరింపు మెయిల్ పంపారు. అప్రమత్తమైన పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా తేల్చినట్లు పోలీసులు వెల్లడించారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande