
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)
ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ పాండు రంగారెడ్డి ఛాంబర్ ముందు విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దాదాపుగా 15 మంది విద్యార్థులు తమకు సీట్లు వచ్చినా కూడా సెకండ్ ఫేజ్లో తమ ప్రమేయం లేకుండా వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయినా, తమ ఫోన్లకు ఓటీపీలు రాకపోయినా తమ సీట్లు వేరే వాళ్లకు అలర్ట్ అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేంటని అడగడానికి వస్తే డైరెక్టర్ పాండురంగారెడ్డి మీ ర్యాంకుకి మీకు వచ్చిన సీటు ఇదే ఎక్కువ మీరు ఇక్కడినుంచి వెళ్లిపోండి అన్నట్టుగా విద్యార్థులపై దురుసుగా మాట్లాడాలని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు డైరెక్టర్ పాండురంగారెడ్డి ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..