
న్యూఢిల్లీ, 22 నవంబర్ (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించింది. శనివారం ఉదయం నగరంలో ఏక్యూఐ లెవెల్స్ 359 వద్ద నమోదైంది. చాలా ప్రాంతాల్లో పూర్ కేటగిరీలో గాలి నాణ్యత సూచిక నమోదైంది.
దీనికి తోడు నగరంపై దట్టమైన పొగ కమ్మేసింది. గాలి నాణ్యత క్షీణించడంతో రాజధానిలో ఆంక్షలు కఠినతరం చేయాలని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించింది. ఈ మేరకు ఎన్సీఆర్ అంతటా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 50 శాతం మంది సిబ్బందికి ఇంటి వద్ద నుండి పని(work from home) సూచించింది. గాలి నాణ్యత క్షీణిస్తున్నందున వాహన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు