అల్పపీడనం ఎఫెక్ట్‌.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అమరావతి, 22 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఒకవైపు చలి జ‌నాల‌ను వ‌ణికిస్తోన్న‌ నేపథ్యంలో, మ‌రోవైపు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయట. ఉపరితల ఆవర్
Rain


అమరావతి, 22 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఒకవైపు చలి జ‌నాల‌ను వ‌ణికిస్తోన్న‌ నేపథ్యంలో, మ‌రోవైపు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్పపీడనం ఎఫెక్ట్ కారణంగా ఏపీలో భారీ వర్షాలు పడనున్నాయట. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం సోమవారం రోజు నాటికి వాయుగుండంగా మారే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలిపింది.

ఈ నేపథ్యంలో ఇవాళ తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం లాంటి జిల్లాలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ అల్పపీడనం నేపథ్యంలో ఏపీ రైతులు వ్యవసాయ పనులలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచనలు చేసింది. ఈ వర్షాలు రేపటి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చలి విపరీతంగా పెడుతోంది. కొన్ని ప్రాంతాల్లో 6 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలు గజగజ వణికి పోతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande