
హైదరాబాద్, 22 నవంబర్ (హి.స.)
ఐబొమ్మ పైరసీ కేసులో నిందితుడు రవి
(Ravi)ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత రెండు రోజులుగా కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. రెండో రోజు కస్టడీలో భాగంగా ఆరు గంటలకు పైగా విచారించారు. ఈ విచారణలో కీలక అంశాలు రాబట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు, అనూహ్యంగా సోషల్ మీడియాలో రవికి సాధారణ ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. దీనిపై ప్రముఖ నిర్మాత బన్నీ వాసు (Bunny Vasu) రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఓ మూవీ ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. ఐబొమ్మ రవిని హీరోగా చూడటాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అతనికి అంత ఎలివేషన్ ఇవ్వడం సరికాదని కామెంట్ చేశారు. పైరసీకి మద్దతుగా మాట్లాడటం చట్టవిరుద్ధమని.. రవి సినీ ఇండస్ట్రీకి రూ. కోట్ల నష్టం తెచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రవిని సోషల్ మీడియా దేవుడిగా చూడొద్దని నిర్మాత బన్నీ వాసు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..