
కడప, 23 నవంబర్ (హి.స.)
: అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం కడప జిల్లాలోని ఆరు డిపోల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ ఆర్‌ఎం గోపాల్‌రెడ్డి తెలిపారు. ‘న్యూస్‌టుడే’తో కడపలోని తన కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. అయిదు, ఆరు, ఏడు రోజుల ప్యాకేజీలుగా విభజించి అద్దె ప్రాతిపదికన బస్సులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కిలో మీటరు ప్రాతిపదికన అద్దె వసూలు చేయనున్నట్లు తెలిపారు. మార్గమధ్యంలోని ఆలయాలు, పుణ్యక్షేత్రాలనూ దర్శించుకోవచ్చని సూచించారు. బుక్ చేసిన ఏజెంట్లు, ఇతరులకు కమీషన్ ఉంటుందని, కన్యస్వాములు, వంట మనుషులు ఏడుగురు అదనంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ